హైదరాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ రైలు మంజూరు చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బడ్జెట్ లో రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది
- కేంద్రం తీరు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది
- తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం
పంట సేకరణ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఇదే సమయంలో రైతు సమస్యలపై ఎందుకు మాట్లాడలేకపోయిందని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేస్తుంటే కనీస మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్ తో పాటు బుల్లెట్ రైలును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు.