ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం
- ఏపీలో ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
- ఆఖరిరోజున భారీగా నామినేషన్లు
- రేపు నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు
- ఫిబ్రవరి 4న ఉపసంహరణకు తుది గడువు
కాగా, అధికారులు రేపు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 9న తొలిదశ పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ఉంటుంది. కాగా, ఏపీలో తొలిదశలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 32,504 వార్డుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.