మేనిఫెస్టోపై వివ‌ర‌ణ ఇవ్వండి: టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు

sec gives notice to tdp
  • ఇప్ప‌టికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
  • వ‌చ్చేనెల‌ 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్న ఎస్ఈసీ
  • మేనిఫెస్టో విడుద‌ల‌ సరైనది కాదని వ్యాఖ్య‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ప‌ల్లె ప్ర‌గ‌తి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. దీనిపై ఇప్ప‌టికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడం స‌రికాద‌ని వ్యాఖ్యానించింది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల‌ని ఆదేశిస్తూ  ఎస్‌ఈసీ టీడీపీకి నోటీసులు జారీచేసింది. వ‌చ్చేనెల‌ 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక‌ ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ అంటున్నారు.
Go Back to Shorts
Telugudesam
YSRCP
Andhra Pradesh
Local Body Polls

More Telugu News