Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Kajal signs one more film in Tamil
షార్ట్స్‌లో చూడండి
*  పెళ్లయినా కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలోను, తమిళంలో కమల్ తో 'ఇండియన్ 2' సినిమాలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో తమిళ  చిత్రానికి ఓకే చెప్పింది. ఆమధ్య ప్రభుదేవాతో 'గులేబకావళి' చిత్రాన్ని రూపొందించిన కల్యాణ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  చిరంజీవి, వెంకటేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలను వచ్చే మే నెలలో రిలీజ్ చేయడానికి డేట్స్ లాక్ చేసుకున్న సంగతి విదితమే. ఇదే కోవలో ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ కూడా తన తాజా చిత్రాన్ని మే నెలలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. 
*  అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' పేరిట హీరో మహేశ్ బాబు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంటున్న ఈ చిత్రాన్ని జులై 2న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబై దాడుల సమయంలో వీరోచితంగా పోరాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
Go Back to Shorts
Kajal Agarwal
Chiranjeevi
Prabhas
Mahesh Babu

More Telugu News