Mohan Babu: మంచు మోహన్ బాబు కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

  • మోహన్ బాబు ప్ర‌ధాన‌పాత్ర‌లో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ
  • దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న సినిమా
  • మెడ‌లో రుద్రాక్ష‌, మాసిన గ‌డ్డం, సీరియ‌స్ లుక్‌తో మోహ‌న్ బాబు  
first look of Collection king  themohanbabu  from SonOfIndia

మంచు మోహన్ బాబు ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపుదిద్దుకుంటోన్న 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది. దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహ‌న్ బాబు లుక్ అందుకు త‌గ్గ‌ట్లుగానే ఉంది. మెడ‌లో రుద్రాక్ష‌, మాసిన గ‌డ్డం, సీరియ‌స్ లుక్‌తో మోహ‌న్ బాబు క‌న‌ప‌డుతున్నారు.

జాతీయ‌ జెండాను పోలిన‌ మూడు రంగుల మీద ఈ సినిమా టైటిల్ ను డిజైన్ చేశారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొన‌సాగుతోంది.

More Telugu News