రాబోయే రోజుల్లో టీఎంసీ ఖాళీ అవుతుంది.... అన్ని స్థానాల్లో మమతానే పోటీ చేస్తారేమో!: సువేందు అధికారి వ్యంగ్యం
- ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు
- మమతా బెనర్జీపై విమర్శల పర్వం
- నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానన్న మమత
- మమత ఎక్కడ పోటీ చేసినా మోత తప్పదన్న సువేందు
అంతేకాదు, మమత దాంజూర్, బాలీ సీట్లలోనూ పోటీ చేస్తానని అంటున్నారు... ఆమె ఎక్కడికి వెళ్లినా పరాభవం తప్పదు అంటూ వ్యాఖ్యానించారు. సువేందు అధికారి మమత కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మమతకు కుడిభుజం వంటి వ్యక్తి అని భావించిన సువేందు టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.