Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' మొదలైంది!

  • ఆక్షన్ అండ్ యాక్షన్ బిగిన్స్
  • ట్విట్టర్ లో వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్  
  • పరశురామ్ దర్శకత్వం.. తమన్ సంగీతం  
Mahesh Says Sarkaru vaari Paata Shooting Bigins

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త వచ్చింది. మహేశ్ నూతన చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలైపోయిందని సామాజిక మాధ్యమాల ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఉదయం వెల్లడించింది.

'ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్' (వేలం మరియు షూటింగ్ ప్రారంభమైంది) అన్న క్యాప్షన్ తో ఓ చిన్న వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి తమన్ స్వరాలను సమకూర్చనున్నాడు.

More Telugu News