ఏపీ కరోనా అప్ డేట్: 137 కొత్త కేసులు, నాలుగు మరణాలు
- గత 24 గంటల్లో 48,313 టెస్టులు
- అత్యధికంగా విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరిలో 17 చొప్పున కేసులు
- అత్యల్పంగా కడప జిల్లాలో 4 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,488
అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,86,694 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,060 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 1,488 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,146కి చేరింది.