కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?
- ఢిల్లీ నుంచి గెహ్లాట్‌కు పిలుపు
- రాహుల్ కాదంటే పార్టీ పగ్గాలు ఆయనకే
- గెహ్లాట్ అంగీకరిస్తే రాజస్థాన్ సీఎం పగ్గాలు వేరొకరికి!
ఈ నేపథ్యంలో పార్టీకి, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన గెహ్లాట్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కనుక అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తే కనుక అశోక్ గెహ్లాట్‌కే ఆ అవకాశం దక్కే అవకాశం ఉందని సమాచారం. సోనియా అభ్యర్థనకు గెహ్లాట్ అంగీకరిస్తే కనుక రాజస్థాన్ సీఎం పగ్గాలు మరో నేత చేతుల్లోకి వెళ్తాయి.