Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Thamanna about her long career in Tollywood
షార్ట్స్‌లో చూడండి
*  'నా కష్టానికి అదృష్టం కూడా తోడవడం వల్లే గత పదిహేనేళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగగలుగుతున్నా'నని అంటోంది అందాలభామ తమన్నా. 'కెరీర్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను, నా కెరీర్ ఇక అయిపోయిందని కూడా చాలామంది చాలాసార్లు కామెంట్ చేశారు. అన్నిటినీ మౌనంగానే ఎదుర్కొన్నాను. ఆత్మవిశ్వాసంతో కొనసాగాను' అని చెప్పింది తమన్నా.
*  పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ పై ఓ పాట  చిత్రీకరణను పూర్తిచేసినట్టు తెలుస్తోంది. త్వరలో మరోపాటను కూడా చిత్రీకరిస్తారట.
*  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ గతంలో ఓ కొరియన్ చిత్రాన్ని 'ఓ బేబీ' పేరిట రీమేక్ చేసిన సంగతి విదితమే. ఈ కోవలో ఇప్పుడు మరో కొరియన్ చిత్రం 'లక్కీ కీ'ని కూడా రీమేక్ చేస్తున్నట్టు సదరు సంస్థ ప్రకటించింది. ఓ ప్రముఖ హీరో, ప్రముఖ దర్శకుడు కలసి దీనికి పనిచేస్తారని సురేశ్ సంస్థ పేర్కొంది.
Go Back to Shorts
Thamanna
Pawan Kalyan
Krish

More Telugu News