ఏపీ కరోనా అప్ డేట్: 179 కొత్త కేసులు, ఒకరి మృతి
- గత 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
- 1,660కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
అదే సమయంలో 231 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,86,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,443 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,660కి తగ్గింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,142కి చేరింది.