ఏపీ కరోనా అప్ డేట్: 161 కొత్త కేసులు, 1 మరణం
- గత 24 గంటల్లో 36,091 పరీక్షలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 52 కేసులు
- కడప జిల్లాలో కొత్త కేసులు నమోదు కాని వైనం
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,896
అదే సమయంలో 251 మంది కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,985కి పెరిగింది. 8,76,949 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,896 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 7,140కి చేరింది.