మెగా బ్రదర్స్ సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్న బిగ్ బాస్ భామ
Add ap7am to your home Screen

మెగా బ్రదర్స్ సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్న బిగ్ బాస్ భామ

Bigg Boss beauty Divi grabs chances in Mega heroes projects
  • బిగ్ బాస్-4లో అందరినీ అలరించిన దివి
  • పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆఫర్ చేసిన చిరంజీవి
  • పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలోనూ అమ్మడికి మంచి పాత్ర!
  • వరుస చాన్సులతో ఎగిరి గంతేస్తున్న దివి
బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కొన్ని వారాలే హౌస్ లో ఉన్నా అందరినీ అలరించిన బ్యూటీ దివి. ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు రెండు చేతులా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కొత్త చిత్రంలో దివికి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇవ్వగా.... లేటెస్ట్ గా పవన్ కల్యాణ్-రానా కాంబోలో వస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్-4కి ముందు దివి ఎవరో చాలామందికి తెలియదు. కానీ, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందంటే అతిశయోక్తి కాదు. అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు గుంపులో గోవింద వంటి వేషాలతో సరిపెట్టుకున్న దివి ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.
Divi
Bigg Boss Telugu 4
Chiranjeevi
Pawan Kalyan
Tollywood

More Telugu News