పాక్ క్రికెటర్ల వయసును పదేళ్ల వరకూ తక్కువ చేసి చూపుతున్నారు: మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు!
- బౌలర్ల వయసు 18 ఏళ్లుగా చూపుతున్నారు
- నిజమైన వయసు 28 ఏళ్ల వరకూ
- ఐదారు ఓవర్లకే అలసిపోతున్నారన్న ఆసిఫ్
పేసర్ల వయసును 17 లేదా 18 అని చూపిస్తున్నారని, కానీ వారి నిజమైన వయసు 27 లేదా 28 వరకూ ఉంటుందని, అందువల్లే వారిలో 20 నుంచి 25 ఓవర్ల పాటు బౌలింగ్ చేసే సత్తా ఉండటం లేదని అన్నారు. ఐదారు ఓవర్ల తరువాతనే వారు అలసిపోతున్నారని, దీని ప్రభావం ఫీల్డింగ్ పై కనిపిస్తోందని అన్నారు.
ఈ మేరకు కమ్రాన్ అక్మల్ నిర్వహిస్తున్న యూ ట్యూబ్ చానెల్ లో ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇదే సమయంలో ఎవరి వయసు ఎక్కువన్న విషయాన్ని మాత్రం ఆసిఫ్ బయట పెట్టక పోవడం గమనార్హం.