సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పది భాషల్లోకి సమంత వెబ్ సీరీస్
- స్క్రిప్టుకి మార్పులు చేసిన క్రిష్
- వేసవికి వెళ్లిన 'రంగ్ దే' విడుదల
* పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయింది. కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్టును తగ్గించాలని నిర్ణయించడంతో, అందుకు తగ్గట్టుగా స్క్రిప్టుకి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ నటించే సినిమా ఇదే అవుతుంది.
* నితిన్ కథానాయకుడుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రం విడుదల అనుకున్నట్టుగానే వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రాన్ని మార్చ్ 26కి వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.