అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీలో చేరిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు

Six JDU MLAs joins BJP in Arunachal Pradesh
  • వీరిలో ముగ్గురిని నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది  
  • బీజేపీకి మిత్రపక్షంగానే ఉంటామన్న జేడీయూ  
  • స్నేహపూర్వక ప్రతిపక్షంగానే కొనసాగుతామని వ్యాఖ్య  
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూకి గుడ్ బై చెప్పి... బీజేపీలో చేరారు. ఈ ఆరుగురిలో ముగ్గురిని నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వీరిపై చర్యలు తీసుకుంది. మరోవైపు బీజేపీకి జేడీయూ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ మద్దతుతోనే బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కొనసాగుతున్నారు.

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి వైపు నిలిచారని చెప్పారు. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండు నాయకత్వంపై నమ్మకముంచారని తెలిపారు. ఇంకోవైపు  జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా... తాము ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. బీజేపీతో తాము స్నేహపూర్వక ప్రతిపక్షంగానే కొనసాగుతామని అన్నారు.
Go Back to Shorts
Nitish Kumar
JDU
BJP
Arunachal Pradesh
MLAs

More Telugu News