Andhra Pradesh: అంత్యక్రియలకు తీసుకెళుతుంటే పాడెపై నుంచి లేచాడు.. 24 గంటలు కూడా గడవకముందే ప్రాణాలు విడిచాడు!

Man who died woke up on the way to graveyard
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు. అయితే, ఆ తర్వాత 24 గంటల్లోపే అతడు మరణించాడు. మదనపల్లె రూరల్ మండలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సోమవారం అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఉలుకు, పలుకు లేకపోవడం, అచేతనంగా ఉండడంతో అతడు చనిపోయాడని భావించిన గ్రామస్థులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు.

అతడిని పాడెపైకి చేర్చి శ్మశానానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దిగ్గున లేచి కూర్చున్నాడు. దీంతో హడలిపోయిన జనం.. ఆ తర్వాత తేరుకుని వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు నిన్న తెల్లవారుజామున మరణించాడు. పాడెపై నుంచి లేచిన వ్యక్తి 24 గంటల్లోనే మృతి చెందడం గ్రామంలో చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
Andhra Pradesh
Chittoor District
Madanapalle
Dead

More Telugu News