రక్తదానంలో వరల్డ్ రికార్డు సాధించిన వైసీపీ కార్యకర్తలు
- ఇవాళ సీఎం జగన్ జన్మదినం
- రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన వైసీపీ
- 8 గంటల్లో 34,723 మంది రక్తదానం
- వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- సజ్జలకు మెడల్ ప్రదానం చేసిన సంస్థ ప్రతినిధులు
సీఎం జగన్ 48వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్నిరోజుల ముందు నుంచే రక్తదాన శిబిరాల గురించి ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.