Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి.. ధ్రువీకరించిన సినిమా యూనిట్

Rana Daggubati  to join our Powerstar PawanKalyan for Production No 12
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రీమేక్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.

పూజా కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్, చిత్ర బృందం పాల్గొంది. కెమెరా స్విచాన్ చేసి త్రివిక్రమ్ ఈ షూటింగ్‌ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌‌తో పాటు, టాలీవుడ్‌ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడని తెలుపుతూ సినిమా బృందం ఓ వీడియోను విడుదల చేసింది. మరోపక్క, తన మరో జర్నీ ప్రారంభమైందంటూ రానా కూడా ట్వీట్‌ చేశాడు.

తాను సినీ పరిశ్రమలో చాలా మంది తారలతో పనిచేశానని, ఇపుడు పవర్ స్టార్ తో పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ వచ్చేనెల ప్రారంభం కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.  
Go Back to Shorts
Pawan Kalyan
Rana Daggubati
Tollywood

More Telugu News