Pawan Kalyan: కింద కూర్చొని అభిమానులతో పవన్ కల్యాణ్ ఫొటో!
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా కింద కూర్చొని ఫ్యాన్ తో దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆయన సింప్లిసిటీకి ఇదో ఉదాహరణ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు షూటింగ్ జరుగుతోన్న ప్రాంతం వద్దకు వచ్చారు.
ఈ నేపథ్యంలో పవన్ తో ఫొటో దిగి సంబరపడ్డారు. వారితో కలిసి పవన్ కల్యాణ్ కింద కూర్చొని ఫొటోకు పోజులు ఇవ్వడం గమనార్హం. ఈ ఫొటోలో పవన్ చాలా యంగ్ గా కనపడుతున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. గతంలోనూ కొన్ని సార్లు పవన్ ఇలాగే కింద కూర్చొని అభిమానులతో ఫొటోలు దిగారు.
కాగా, చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ చేతిలో వకీల్ సాబ్ మాత్రమే కాకుండా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ఉన్న విషయం తెలిసిందే.