Pawan Kalyan: మళ్లీ 'వకీల్ సాబ్' షూటింగులో పవన్!

  • ఇటీవల ఏపీ పర్యటనకు వెళ్లొచ్చిన పవన్ 
  • ప్రస్తుతం యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
  • పవన్ తో పాటు షూటింగులో శ్రుతి హాసన్
  • ఈ షెడ్యూలుతో సినిమా మొత్తం పూర్తి
Pawan joins Vakeel Saab shoot

ఇటీవల ఏపీ పర్యటనకు వెళ్లొచ్చిన పవన్ కల్యాణ్ మళ్లీ తాజాగా 'వకీల్ సాబ్' షూటింగులో జాయిన్ అయ్యారు. హిందీ హిట్ సినిమా 'పింక్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఆమధ్య ఆయన ఈ చిత్రం కోసం కొన్నాళ్లు షూటింగ్ చేశారు.  

ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని, ఇప్పుడు మళ్లీ పవన్ హైదరాబాదులో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఓ యాక్షన్ సన్నివేశాన్ని, కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లను పవన్ పై చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఆయనతో పాటు శ్రుతి హాసన్ కూడా పాల్గొంటోంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తికావడంతో, ఈ షెడ్యూలుతో మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.

పవన్ ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అంజలి, నివేద థామస్ కథానాయికలుగా నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలకమైన పాత్రలో కనిపిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ తో కలసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.  

More Telugu News