adavi sesh: 'మేజర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

  • అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా
  • మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మూవీ
  • అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌
  • విడుదల చేసిన సూపర్ స్టార్
major first look releases

హీరో అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.  26/11లో జరిగిన ముంబై ఉగ్రదాడిలో పోరాడి వీరమరణం చెందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్‌కు అడివి శేష్ కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సినిమాకు శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శోభిత ధూళిపాళ్లతో పాటు ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.

More Telugu News