రిపబ్లిక్ డే పరేడ్ లో కనువిందు చేయనున్న అయోధ్య రామమందిర శకటం
Add ap7am to your home Screen

రిపబ్లిక్ డే పరేడ్ లో కనువిందు చేయనున్న అయోధ్య రామమందిర శకటం

Ayodhya Ram Mandir tableaux to be showcased in Republic Day parade
  • జనవరి 26న ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • రామ మందిర శకటాన్ని రూపొందిస్తున్న ఉత్తరప్రదేశ్
  • కేంద్రం ఆమోద ముద్ర వేసిందని ప్రకటన
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం కనువిందు చేయనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నమూనాను ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతోపాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ శకటాన్ని రూపొందించనుంది. 'కల్చరల్ హెరిటేజ్ ఉత్తరప్రదేశ్' పేరుతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందించనున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శకటానికి కేంద్రం ఆమోదముద్ర వేసిందని చెప్పింది.

Ayodhya Ram Mandir
Republic Day
Tableaux

More Telugu News