ఏపీ కరోనా అప్ డేట్: 520 కొత్త కేసులు, 2 మరణాలు
- గత 24 గంటల్లో 64,425 టెస్టులు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కేసులు
- అత్యల్పంగా కడప జిల్లాలో 9 మందికి పాజిటివ్
- కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి
- 519 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 5,236
అత్యల్పంగా కడప జిల్లాలో 9 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 20 కేసులు వచ్చాయి. అదే సమయంలో 519 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇద్దరు మృత్యువాతపడ్డారు. కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 7,049కి పెరిగింది.
ఏపీలో ఇప్పటివరకు 8,74,515 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,62,230 మంది కోలుకున్నారు. ఇంకా 5,236 మంది చికిత్స పొందుతున్నారు.