ఏపీ కరోనా అప్ డేట్: 551 కొత్త కేసులు, 4 మరణాలు
- రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 56,187 కరోనా టెస్టులు
- అత్యధికంగా కృష్ణా జిల్లాలో 108 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
- 774 మందికి కరోనా నయం
అదే సమయంలో 744 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,72,839 మంది కరోనా బారినపడగా 8,60,368 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,429 మందికి చికిత్స కొనసాగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,042కి చేరింది.