టీటీడీ పాలకమండలి సమావేశం వివరాలు ఇవిగో!

TTD governing council takes key decisions
  • వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ సమావేశం
  • ఇకపై 10 రోజల పాటు వైకుంఠ ద్వార దర్శనం
  • జిల్లాల్లో కల్యాణమస్తు పునరుద్ధరణ
  • ప్రైవేటు భద్రతా సిబ్బందికి యూనిఫాం భత్యం
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ఇవాళ సమావేశైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధం సఫలమైందని తెలిపారు. తిరుమలలో విద్యుత్ ఆధారిత బస్సులు తిప్పాలని భావిస్తున్నామని, ఈ విషయం సీఎం జగన్ కు విన్నవిస్తే ఆయన సానుకూలంగా స్పందించి 100 నుంచి 150 బస్సులు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

ముఖ్యంగా, ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవాలని నిర్ణయించామని, గతంలో ఒక్కరోజే ఈ తరహా దర్శనం అమల్లో ఉండేదని చెప్పారు. ఇకపై వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరవాలన్న నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించామని, వారు తమ సమ్మతి తెలిపారని వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తామని వివరించారు.

అంతేకాకుండా, గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమం చేపట్టేదని, ఇకమీదట ఆ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాల్లో పునరుద్ధరించదలిచామని చెప్పారు. తిరుమలలో పనిచేసే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి యూనిఫాం భత్యం కింద రూ.2000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని వైవీ వెల్లడించారు.
Go Back to Shorts
TTD
Tirumala
YV Subba Reddy
Jagan
Andhra Pradesh

More Telugu News