సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సంక్రాంతికి రష్మిక నుంచి రెండు సినిమాలు
- తాజా షెడ్యూలు మొదలెట్టిన మోహన్ బాబు
- విశాల్, ఆర్య మల్టీ స్టారర్ టైటిల్ 'ఎనిమి'
* ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
* తమిళ హీరోలు విశాల్, ఆర్య కలసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి 'ఎనిమి' అనే టైటిల్ని నిర్ణయించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారు. తెలుగులో కూడా విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.