KTR: ప్రతిసారి నేనే ఛాలెంజ్ చేయాలా? ఈసారి వాళ్లను చేయమనండి!: కేటీఆర్

KTR mind blowing answer to reporters question
షార్ట్స్‌లో చూడండి
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈరోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని, ఈసారి కూడా అదే ఛాలెంజ్ మళ్లీ చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... 'ప్రతిసారి నేనే ఛాలెంజ్ చేయాలా? ఈసారి వాళ్లను చేయమనండి. వాళ్లు ఛాలెంజ్ చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా' అని చెప్పారు.

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... తామైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని చెప్పారు. గోల్కొండపై కేసీఆర్ జాతీయ జెండాను ఎప్పుడో ఎగరేశారని... ఆ విషయం బండి సంజయ్ కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గోల్కొండపై కొత్తగా బండి సంజయ్ ఎగరేసేదేమీ లేదని అన్నారు.
Go Back to Shorts
KTR
TRS
Bandi Sanjay
BJP
GHMC Elections

More Telugu News