పరిస్థితి దారుణంగా ఉంది.. ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ
- మహేశ్వరం నియోజకవర్గంలో చాలా కాలనీలు ఇంకా వరదనీటిలోనే
- అధికారులను అడిగితే నిధులు లేవంటున్నారు
- బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వండి
అధికారులు, కలెక్టర్‌ను అడిగితే నిధులు లేవని, రాగానే పనులు చేస్తామని, ప్రభుత్వానికి నివేదికలు పంపామని చెబుతున్నారని లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి నియోజకవర్గంలో రెండు నెలలుగా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేపట్టాలని కోరారు. నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో కోరారు.