ఉపాసన కోరికపై.. జర్నలిస్టు అవతారం ఎత్తుతున్న రష్మిక!

Rashmika turns journalist
  • ఉపాసన ఆధ్వర్యంలో 'యువర్ లైఫ్'  
  • ఆరోగ్యానికి సంబంధించిన వెబ్ పోర్టల్ 
  • ఇటీవల గెస్ట్ ఎడిటర్ గా పనిచేసిన సమంత
  • ఉపాసన కోరికపై గెస్ట్ ఎడిటర్ గా ఈసారి రష్మిక  
కథానాయికగా బిజీగా వున్న టాలీవుడ్ ప్రెట్టీ డాల్ రష్మిక ఇప్పుడు జర్నలిస్టు అవతారం ఎత్తుతోంది. అందులోనూ ఒకేసారి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనుంది. అయితే, ఇది పర్మినెంట్ గా కాదులెండి.. ఓ వెబ్ పోర్టల్ కి గెస్ట్ ఎడిటర్ గా రష్మిక వ్యవహరించనుంది.

మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. మరోపక్క, ఆరోగ్యానికి సంబంధించిన పలు వివరాలను తెలియజేసే 'యువర్ లైఫ్' అనే వెబ్ పోర్టల్ ను కూడా నిర్వహిస్తూ, ప్రజలలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

దీనికి ఆమధ్య కథానాయిక సమంత గెస్ట్ ఎడిటర్ గా పనిచేసి, పలు హెల్త్ టిప్స్ ను, ఆరోగ్యాన్నిచ్చే రెసిపీ తయారీ విధానాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో ఉపాసన కోరికపై ఈసారి ఈ వెబ్ పోర్టల్ కి కథానాయిక రష్మిక గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనుంది. మరి, రష్మిక ఎడిటర్ గా ఎటువంటి ఆర్టికల్స్ అందిస్తుందో చూడాలి!
Go Back to Shorts
Rashmika Mandanna
Upasana
Samantha
Your Life

More Telugu News