ట్రంప్ కు ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన జెరూసలేమ్ మునిసిపాలిటీ!

Job Offer for Trump from Jerusalem
  • ట్రంప్ ను హేళన చేసిన అధికారులు
  • అనుకోకుండా పోస్ట్ పడిందని వివరణ
  • ఉద్యోగ ఆఫర్ డిలీట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ ను హేళన చేస్తూ, జరూసలేమ్ మునిపల్ అధికారులు ఓ ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు ట్వీట్ పెట్టి, కలకలం రేపారు. అధ్యక్షుడిగా ఉద్యోగం పోయినందుకు బాధ పడవద్దని, తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని, జెరూసలేమ్ మునిసిపల్ అధికారులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని పురపాలక అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని పలు కంపెనీలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Donald Trump
Jerusalem
Municipal
Job
Offer

More Telugu News