బద్వేలులో విషాదం... కరోనాపై ఒకసారి గెలిచినా, రెండోసారి ఓడి మృత్యువు ఒడిలోకి వెళ్లిన యువ డాక్టర్
- ప్రభుత్వ వైద్యుడికి రెండుసార్లు సోకిన కరోనా
- మొదటిసారి సోకినప్పుడు విజయవంతంగా కోలుకున్న వైనం
- రెండోసారి కబళించిన కరోనా
అయితే, ఇటీవలే మళ్లీ కరోనా సోకింది. రెండు వారాల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఇంటివద్దే చికిత్స పొందారు. తగ్గకపోవడంతో కడప రిమ్స్ కు వెళ్లారు. అక్కడ్నించి తిరుపతి స్విమ్స్ కు, ఆపై చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ నందకుమార్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పనిచేసిన ఆసుపత్రిలో సిబ్బంది, బంధుమిత్రులు తీవ్ర విచారానికి లోనయ్యారు.