Donald Trump: ‘ఓటమి’ ఒత్తిడి తట్టుకోవడం కోసం ట్రంప్ ప్రయత్నాలు.. వీడియో ఇదిగో

  • వర్జీనియాలోని స్టెర్లింగ్ లోని ‘ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్’లో ట్రంప్
  • సరదాగా గోల్ఫ్ ఆడిన ట్రంప్
  • ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిన ట్రంప్
Trump was at his Virginia golf course when the presidential race was called for Joe Biden

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి ఖరారవుతోన్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని తట్టుకోవడానికి గోల్ఫ్ ఆడారు. వర్జీనియాలోని స్టెర్లింగ్ లోని ‘ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్’లో ఆయన సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాసేపు ‘ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్’లో గోల్ఫ్ ఆడిన ట్రంప్ అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయనపై డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిచారు. కాగా, అమెరికాలో ట్రంప్ నాలుగేళ్ల పాటు అవలంబించిన‌ విధానాలను జో బైడెన్‌ చాలా వరకు మార్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

More Telugu News