టాక్ షోకి హోస్టుగా వ్యవహరించనున్న సమంత!
- వివాహానంతరం కూడా రాణిస్తున్న సమంత
- ఇటీవల 'బిగ్ బాస్ 4'కి హోస్టుగా ముద్దుగుమ్మ
- త్వరలో ఫన్నీ టాక్ షోకి హోస్టుగా సామ్
- 'ఆహా' ఓటీటీ ద్వారా త్వరలో స్ట్రీమింగ్
ఈ క్రమంలో ఇటీవల తన మామ అక్కినేని నాగార్జున స్థానంలో 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోకి కొన్ని ఎపిసోడ్లకు గాను హోస్టుగా కూడా వ్యవహరించింది. మంచి సమయస్ఫూర్తితో రియాలిటీ షోని రక్తికట్టించిందంటూ ప్రశంసలు కూడా పొందింది. ఇదిలావుంచితే, ఈ చిన్నది త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఓ టాక్ షో చేయనున్నట్టుగా తెలుస్తోంది.
'ఆహా' ఓటీటీ కోసం సమంత ఈ టాక్ షోను చేస్తోందట. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో మన సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు గెస్టుగా పాల్గొంటారని, ఆద్యంతం ఈ షో చాలా సరదాగా.. ఆహ్లాదకరంగా సాగుతుందని అంటున్నారు.