సోషల్ మీడియాలో వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దు: ఉత్తమ్ సూచన
- దుబ్బాక ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు
- శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నట్లు అసత్య ప్రచారం
- దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
- ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు
శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నట్లు అసత్యప్రచారం చేస్తున్నారని. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆ వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి నిజాయతీగల వ్యక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయంలో ఈ నకిలీ వార్తను సోషల్ మీడియాలో పెట్టారని ఆయన వివరించారు.