బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఈసీ స్పందన
- రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణం
- సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో తప్పు లేదు
- బీజేపీ హామీలో మాకు ఏ తప్పూ కనిపించలేదు
దీనిపై ఈసీ స్పందిస్తూ, ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని తెలిపింది. ప్రజలకు సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణ అంశమేనని తెలిపింది. బీజేపీ హామీలో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.