వాయుకాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు, కోటి జరిమానా: ఆర్డినెన్స్ జారీ
- కాలుష్య నివారణకు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం
- ఎయిర్ క్వాలిటీ కోసం ఏర్పాటు కానున్న కమిషన్
- కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు
కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం ప్రకారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కోసం కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిషన్ ఛైర్మన్ ను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీలో సభ్యులుగా వాణిజ్య శాఖ, రవాణా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు, కేబినెట్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్ ఇచ్చే ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు. కేవలం జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ లో మాత్రమే సవాలు చేయవచ్చు.