ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లు నిషేధించండి: కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ
- ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు యువత బానిసలుగా మారుతున్నారు
- డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- నిషేధించాల్సిన 132 వెబ్‌సైట్ల వివరాలను లేఖతో జత చేసిన జగన్
వీటి బారినపడి డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగుకు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి తన లేఖకు జతచేశారు.