కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీసుజుకి ఆఫర్
- రూ.11 వేల మేర ప్రయోజనాలు
- కొత్త కార్ల కొనుగోళ్లపై వర్తింపు
- కోటి మంది ఉద్యోగులకు సదుపాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది కొత్త కారు కొనే సమయంలో ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చని మారుతీసుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కోటి మంది ఉద్యోగులు ఈ స్పెషల్ ఆఫర్ కు అర్హులని తెలిపారు. పండుగ సీజన్లలో ప్రభుత్వాలు ఉద్యోగులకు అందించే ఎల్టీసీ సదుపాయానికి అదనంగా తాము బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు కేంద్రం పలు చర్యలు ప్రకటించిందని, అందుకు దన్నుగా తమవంతు ఆఫర్ ప్రకటించామని మారుతీసుజుకి వెల్లడించింది.