Mahesh Babu: మెలితిరిగిన మీసంతో మహేశ్ బాబు.. 'డబుల్‌ ధమాకా' వీడియో, ఫొటోలు వైరల్

  • యాడ్‌ కోసం మహేశ్ బాబు ద్విపాత్రాభినయం
  • ఫ్లిప్‌కార్ట్ డబుల్ ధమాకా యాడ్‌లో మహేశ్
  • అలరిస్తోన్న మహేశ్ బాబు లుక్స్‌
Latest pics of Mahesh babu from an advertisement

కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు ఇటీవల విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఆ యాడ్‌ విడుదలైంది.
                 
ఈ ప్రకటనలో మహేశ్ బాబు లుక్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఓ లుక్‌లో చాలా యంగ్‌ గా కనపడుతుండగా, మరో లుక్‌లో మెలితిరిగిన మీసంతో ఉన్నాడు. మహేశ్ బాబును ఎన్నడూ లేని విధంగా ఇలాంటి మీసంతో కనపడుతుండడం ఆయన అభిమానులను అలరిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ కోసం మహేశ్ ఈ యాడ్‌లో నటించాడు. డబుల్ ధమాకా ఆఫర్‌ నేపథ్యంలో ఇలా మహేశ్ డబుల్‌ యాక్షన్‌లో కనపడి ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా మజా అందించాడు.
            

More Telugu News