Rahul Gandhi: ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడను: రాహుల్ గాంధీ

rahul gandhi slams up govt
షార్ట్స్‌లో చూడండి
తాను ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడనని  కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఏ విధమైన అన్యాయానికీ తాను తలవంచనని చెప్పారు. అసత్యాలను సత్యానికి ఉన్న శక్తితో జయిస్తానని పేర్కొన్నారు. అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తాను ఎదుర్కొంటానని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.

కాగా, హత్రాస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో నిన్న బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా రాహుల్ గాంధీని అడ్డగించిన పోలీసులు ఆయనతో పాటు సోదరి ప్రియాంకను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లాల్చీ పట్టుకుని  యూపీ పోలీసులు లాగేయడంతో రాహుల్ కిందపడ్డారు. ఆయన భుజానికి స్వల్పగాయమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
Uttar Pradesh

More Telugu News