మహేశ్ బాబుకి విలన్ గా నిన్నటితరం హ్యాండ్ సమ్ హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబుకి విలన్ గా నిన్నటితరం హ్యాండ్ సమ్ హీరో!

Aravind Swamy to play villan for Mahesh
  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
  • బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సినిమా
  • నవంబర్ నుంచి అమెరికాలో షూట్
  • ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి?    
స్టార్ హీరోలకు హీరోయిన్ ఎంపిక ఎంత కష్టమో.. విలన్ ఎంపిక కూడా ఇంచుమించు అంతే కష్టం. హీరోకి సరితూగే విలన్ పాత్రధారిని ఎంచుకోవడం పెద్ద కసరత్తుతో కూడిన వ్యవహారం. ఒక సినిమాలో చేసిన విలన్ మరో సినిమాలో చేయకూడదు. అంటే, సినిమా సినిమాకీ విలన్ మారుతుండాలన్న మాట. అందుకే, విలన్ పాత్రధారి ఎంపికకు ఆలస్యం అవుతుంటుంది.

ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను ఉపేంద్ర పోషిస్తున్నాడని ఒకసారి.. మరొకరు చేస్తారని.. ఇంకోసారి రకరకాల వార్తలొచ్చాయి. ఈ కోవలో తాజాగా నిన్నటితరం హ్యాండ్ సమ్ హీరో అరవింద్ స్వామి పేరు వినిపిస్తోంది. మహేశ్ కి సరితూగే పర్సనాలిటీ.. స్టేచర్ ఉండడం వల్ల అరవింద్ అయితే సరిగ్గా సరిపోతాడన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఏ విషయం తేలుతుంది.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. బ్యాంక్ స్కాముల నేపథ్యంతో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి షెడ్యూలును నవంబర్ తొలి వారం నుంచి అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. 45 రోజుల పాటు అక్కడ షెడ్యూలు నిర్వహిస్తారు.
Aravind Swamy
Mahesh Babu
Parashuram
Keerti Suresh

More Telugu News