జనాల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ దే విజయం
- అభివృద్ధి పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి
- విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి
విపక్ష నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకావడం లేదని తలసాని ఎద్దేవా చేశారు. కొందరేమో మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఒకసారేమో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగాలని... మరోసారేమో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని అంటూ జనాల్లో లేనిపోని అపోహలు కలిగించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.