మహేశ్‌ బాబు, నమ్రతల ఫొటో తీసిన సితార.. అభిమానులను అలరిస్తోన్న పిక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్‌ బాబు, నమ్రతల ఫొటో తీసిన సితార.. అభిమానులను అలరిస్తోన్న పిక్

mahesh namrata pic goes viral
  • ఫొటో షేర్ చేసిన నమ్రత
  • మన ఉనికికి మూలకారణం ప్రేమే 
  • ప్రేమ మనల్ని సంతోషంగా జీవించేలా చేస్తుందన్న నమ్రత 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను వారి కూతురు సితార తీసింది. దీనిని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మన ఉనికికి మూలకారణం ప్రేమే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని పోస్ట్ కూడా పెట్టింది. ప్రేమ మాత్రమే మనల్ని సంతోషంగా జీవించేలా చేస్తుందని ఆమె పేర్కొంది. దయ, జాలి వంటి వన్నీ ప్రేమ వల్ల కలిగే భావోద్వేగం నుంచే వస్తాయని తెలిపింది.

అందరూ ప్రేమతో ఉండాలని ఆమె కోరింది. మనకు జీవించడానికి ఒక జీవనం ఉందని, అలాగే ఇవ్వడానికి ఒక జీవితం ఉందని, ఇవే తన నిజమైన సంతోషానికి కారణమని చెప్పింది. కాగా, ప్రస్తుతం మహేశ్‌బాబు తన కొత్త సినిమా 'సర్కారు వారి పాట'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులకు బ్రేక్ పడడంతో ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.  
   
Mahesh Babu
namrata
sitara
Viral Pics

More Telugu News