కరోనా రికవరీల్లో ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానం
- బ్రెజిల్, అమెరికాలను వెనక్కి నెట్టేసిన భారత్
- ప్రపంచ రికవరీల్లో 18.83 శాతంతో ముందున్న ఇండియా
- దేశంలో 57.49 శాతం మరణాలు ఆ మూడు రాష్ట్రాలలోనే
ఇక, ప్రపంచవ్యాప్త రికవరీల్లో భారత్ 18.83 శాతంతో ముందుంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో రికవరీ రేటు 79.28 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. మే తొలి వారం నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు పేర్కొంది.
దేశవ్యాప్త రికవరీల్లో బీహార్ 91.8 శాతంతో తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు (89.6 శాతం), పశ్చిమ బెంగాల్ (86.9 శాతం), ఆంధ్రప్రదేశ్ (85.3 శాతం), ఢిల్లీ (84.4 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1,247 మంది చనిపోయారు. 1200 మందికిపైగా చనిపోవడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇక మొత్తం మరణాల్లో 57.49 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలోనే నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది.