డెట్రాయిట్ లో మహేశ్ సినిమా షూటింగుకి ఏర్పాట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డెట్రాయిట్ లో మహేశ్ సినిమా షూటింగుకి ఏర్పాట్లు

Mahesh Babu movie shoot at Detroit
  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'
  • బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సాగే కథ
  • త్వరలో డెట్రాయిట్ లో లొకేషన్ల ఎంపిక
  • విలన్ గా అనిల్ కపూర్ నటించే అవకాశం
మహేశ్ బాబు చిత్రం యూనిట్ అమెరికా వెళ్లడానికి రెడీ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. బ్యాంకులను మోసం చేసి భారీ ఎత్తున రుణాలు తీసుకుని, ఎగవేసి, విదేశాలకు పారిపోయే వ్యక్తుల కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మహేశ్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి.

ఇక కథ ప్రకారం, అమెరికాలో కూడా కొంత భాగం షూటింగ్ చేయాలట. దాంతో అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడానికి చిత్రం యూనిట్ గత కొన్నాళ్లుగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని డెట్రాయిట్ లో చిత్రీకరణ నిర్వహించాలని ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం. దీంతో దర్శకుడు, కెమేరా మేన్ త్వరలో డెట్రాయిట్ కు వెళ్లి లొకేషన్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

అలాగే ముందుగా మహేశ్ లేని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నారట. కరోనా పరిస్థితులు కుదుట పడ్డాక మహేశ్ అమెరికాకు వెళతాడని అంటున్నారు. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. విలన్ పాత్రను బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ పోషించే అవకాశం వుంది.
Mahesh Babu
Keerti Suresh
Parashuram
Sarkaru Vaari Paata

More Telugu News