'వకీల్ సాబ్' షూటింగులో పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే!

Pawans Vakeel Saab shoot update
  • చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్ 
  • లాక్ డౌన్ కి ముందు చాలా భాగం చిత్రీకరణ 
  • ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ మొదలు 
  • పవన్ మాత్రం డిసెంబర్ నుంచి షూటింగ్ 
పవన్ కల్యాణ్ ఓ కొత్త సినిమా చేస్తున్నాడంటే దానికి చాలా క్రేజ్ వుంటుంది. ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ కూడా ఆ సినిమా పట్ల క్రేజ్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.

దాంతో తమ అభిమాన కథానాయకుడి సినిమాను చూడచ్చని అభిమానులు తెగ ఆనందపడ్డారు. అయితే, కరోనా తెచ్చిన లాక్ డౌన్ ఈ చిత్ర నిర్మాణానికి అడ్డుపడింది. లాక్ డౌన్ కి ముందు చాలావరకు షూటింగును పూర్తిచేశారు. పవన్ పై చిత్రీకరించాల్సిన చాలా భాగం పూర్తయింది. అయితే, అంతలోనే లాక్ డౌన్ రావడంతో షూటింగుకి బ్రేక్ పడింది.

ఇప్పుడు ఇక ఒక్కొక్కరూ షూటింగులు మొదలుపెడుతుండడంతో 'వకీల్ సాబ్' చిత్రం షూటింగుకి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ముందుగా పవన్ లేని సన్నివేశాల చిత్రీకరణ కానిచ్చేస్తారట. పవన్ డిసెంబర్లో ఈ షూటింగులో జాయిన్ అవుతారనీ, ఆ నెలాఖరుకి చిత్ర నిర్మాణాన్ని మొత్తం పూర్తిచేస్తారని సమాచారం.

ఇక 'వకీల్ సాబ్' పూర్తయ్యాక, పవన్ తాను చేయాల్సిన క్రిష్ దర్శకత్వంలోని సినిమా, హరీశ్ శంకర్ దర్శకత్వంలోని సినిమా షూటింగులను మొదలెడతారని అంటున్నారు. ఆయా సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Vakeel Saab
Krish
Harish Shankar

More Telugu News