TV Actress: మర్యాదగా రాకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను.. శ్రావణిని దేవరాజ్ బెదిరించిన ఆడియో బయటకు!

  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు
  • తనను వదిలేయమని ప్రాధేయపడిన శ్రావణి
  • తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన సాయి కృష్ణారెడ్డి
Devaraj Reddy Sravani Audio leaked

తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు దేవరాజ్ రెడ్డి.. శ్రావణిని బెదిరించినట్టుగా ఉన్న ఓ ఆడియో బయటపడింది. తనకు, ఆమె ఆత్మహత్యకు సంబంధం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే శ్రావణిని బెదిరించిన ఆడియో బయటకు రావడంతో కేసు మరో మలుపు తిరిగింది.

ఆ ఆడియో టేపులో దేవరాజు రెడ్డి మాట్లాడుతూ.. మర్యాదగా తనతో వచ్చి సమయం గడపాలని, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కానని హెచ్చరించడం స్పష్టంగా ఉంది. అతడి బెదిరింపులకు శ్రావణి స్పందిస్తూ ఇక జరిగింది చాలని, ఇక్కడితో ఆపేయాలని, నీతో మాట్లాడనని ప్రాధేయపడింది.

మరోపక్క, నిన్న దేవారాజ్ మాట్లాడుతూ శ్రావణి ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని, సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తే ఇందుకు అసలు కారణమని ఆరోపించాడు. దేవరాజు ఆరోపణలపై కృష్ణారెడ్డి స్పందించాడు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని, ఆమె జీవితాన్ని కాపాడేందుకు తాను చాలా ప్రయత్నించానని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశాడు.

ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆ కుటుంబంతోపాటే ఉన్నానని పేర్కొన్నాడు. ఆమె కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని కృష్ణారెడ్డి పేర్కొన్నాడు. కాగా, దేవరాజు రెడ్డిపై శ్రావణి గతంలోనే బెదిరింపులు, అత్యాచారయత్నం వంటి కేసులు పెట్టింది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు దేవరాజ్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News