చాలా రోజుల త‌ర్వాత.. యాడ్ షూట్ లో మ‌హేశ్ బాబు.. ఫొటో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా రోజుల త‌ర్వాత.. యాడ్ షూట్ లో మ‌హేశ్ బాబు.. ఫొటో ఇదిగో

mahesh on ad shoot
  • హైద‌రాబాద్ లో రేపు షూటింగ్
  • అన్న‌పూర్ణ స్టూడియోకి వ‌చ్చిన మ‌హేశ్
  • క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ ఏర్పాట్లు
లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన సినీన‌టుడు మ‌హేశ్ బాబు మ‌ళ్లీ తొలిసారి షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. రేపు హైద‌రాబాద్ లో  ఓ వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న షూటింగ్ లో ఆయ‌న పాల్గొన‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోకు వ‌చ్చి షూటింగ్ జ‌రిగే ప్రాంతాన్ని ప‌రిశీలించి, నిర్వాహ‌కుల‌తో మాట్లాడాడు.

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఆ ప్రాంతంలో అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అక్క‌డి సిబ్బంది పీపీఈ కిట్ల‌ను ధ‌రించి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తున్నారు. మ‌హేశ్ బాబు అక్క‌డకు వచ్చిన ఫొటోను శ్రేయాస్ గ్రూప్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మాస్క్ ధ‌రించిన మ‌హేశ్ బాబు అక్క‌డి వారితో మాట్లాడాడు.
Mahesh Babu
Tollywood
Viral Pics

More Telugu News