మరో సాహసానికి రెడీ అవుతున్న సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో సాహసానికి రెడీ అవుతున్న సమంత!

Samantha ready for doing a challenging role
  • కొత్త తరహా పాత్రలకు సై అంటున్న సమంత
  • అశ్విన్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం
  • మూగ, బధిర యువతి పాత్రలో సమంత
సాధారణంగా గ్లామర్ పాత్రలు పోషించే హీరోయిన్లు డీ గ్లామరైజ్డ్ పాత్రలు చేయడానికి అంగీకరించరు. అలాంటివి చేస్తే కమర్షియల్ సినిమాలలో తమకు అవకాశాలు తగ్గుతాయేమోనన్నది వారి భయం. అందుకే రొటీన్ కి భిన్నంగా.. కొత్త తరహా పాత్రలు పోషించే సాహసాన్ని చేయరు.

అయితే, ఇప్పుడు ట్రెండ్ కాస్త మారిందనే చెప్పచ్చు. గ్లామర్ పాత్రలు పోషిస్తూనే, అప్పుడప్పుడు కొత్తతరహా పాత్రలు చేయడానికి కొందరు హీరోయిన్లు ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో సమంత కూడా వుంది. ఆమధ్య 'ఓ బేబీ' సినిమాలో కొత్తతరహా ప్రయోగాత్మక పాత్రను చేసి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.

ఈ క్రమంలో తాజాగా మరో సినిమాలో సాహసాన్నే చేయనుంది. మూగ, బధిర యువతిగా నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో సమంత ఇలా మూగ, బధిర యువతిగా కనిపించనుంది. గతంలో 'మయూరి', గేమ్ ఓవర్' చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశ్విన్ ఇప్పుడీ చిత్రాన్ని హారర్ కథాంశంతో రూపొందించనున్నాడని తెలుస్తోంది. సమంత ఈ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేయడానికి సమాయత్తమవుతోంది.
Samanta
Oh Baby
Ashwin Sharavanan

More Telugu News